IND v AUS Secondtest రోహిత్ రీ ఎంట్రీ తో ఆ ముగ్గురిపై వేటుపడే అవకాశం!
IND v AUS Secondtest Match Squad:
IND v AUS Secondtest ఆస్ట్రేలియా పర్యటనలో విజయవంతంగా ప్రారంభించిన టీమిండియా రెండో ఆసక్తికర పోరుకి సిద్ధంగా ఉంది ఐదు టెస్టుల బోర్డర్ గవస్కర్ ట్రోపీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో 295 పరుగుల భారీ విజయంతో గెలిచిన భారత్ డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా జరగనున్న పింక్ బాల్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ కోసం సన్నాహకాలు ప్రాంభించింది పెర్త్ టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో స్టార్ బౌలర్ జస్ప్రిత్ బూమ్రా టీమిండియా జట్టును నడిపించాడు అటు కెప్టెన్ గా ఇటు స్టార్ బౌలర్ గా సత్తా చాటి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి చూపించాడు. మొత్తంగా మొదటి టెస్ట్ మ్యాచ్లో 8 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆల్ అవుట్ అయిన భారత్, ఆస్ట్రేలియాను 104 పరుగులకే కుప్ప కూల్చారు.
పెర్త్ మొదటి టెస్ట్ స్కోర్ వివరాలు
ఇండియా
150 & 487/6d
ఆస్ట్రేలియా
104 & 238
ఇండియా 295 పరుగుల తేడాతో గెలిచింది .
ప్లేయర్ అఫ్ ది మ్యాచ్
జస్ప్రీత్ బుమ్రా
పింక్ బాల్ డే అండ్ నైట్ టెస్ట్:
రెండో ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ టెస్ట్ శతకాలతో విజృంభించడంతో టీమ్ ఇండియా 487/6 వద్ద రెండో ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది. ఆసీస్ ముందు 534 భారీ పరుగుల లక్ష్యం ఉంచింది రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన ఆసీస్ 238 పరుగులకే కుప్పకూలి పరాజయాన్ని చవిచూసింది. ఈ విజయం ఇలాగే కొనసాగించాలని టీమిండియా చూస్తుంది కానీ రెండో టెస్ట్ లో ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ ఎదురుచూస్తుంది
రోహిత్ రీ ఎంట్రీ తో ఆ ముగ్గురిపై వేటుపడే అవకాశం:
డే నైట్ గా జరిగే ఆడిలైట్ రెండో టెస్ట్ మ్యాచ్ లో పింక్ బాల్ తో ఆడనున్నారు ఈ మ్యాచ్ కోసం భారత్ ప్రత్యేకంగా ప్రాక్టీస్ మొదలుపెట్టింది మొదటి టెస్ట్ కు అందుబాటులో లేని కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే టీమిండియా జట్టుతో కలవగా గాయంతో బెంచ్ కి పరిమితమైన శుభ్ మన్ గిల్ కూడా రెండో టెస్ట్ కు ప్లేయింగ్ లెవెల్ లోకి రానున్నాడు దీనితో భారత్ తుది జట్టును మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆడిలైట్ పిచ్ కు తగ్గట్టు టీమిండియా తుదిజట్టు ను ఎంపిక చేయనున్నారు రోహిత్ అందుబాటులోకి రావడంతో ఓపెనర్ గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ కి పరిమితం కానున్నాడు శుభ్ మన్ గిల్ కూడా అందుబాటులోకి రానున్నాడు కాబట్టి దేవదత్ పాడిక్కాల్ , ధ్రువ్ జురెల్ బెంచ్ కు పరిమితం కానున్నారు
ఆడిలైట్ పిచ్ స్పిన్నుకు అనుకూలంగా ఉండవచ్చు కాబట్టి వెటరన్ స్పిన్నర్ అశ్విన్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది అప్పుడు వాషింగ్టన్ సుందర్ బెంచికి పరిమితం అవుతాడు ఈ మూడు మార్పులు తప్ప మరే మార్పులు జట్టులో జరిగే అవకాశం లేదు టీమిండియా ముగ్గురు పేసర్లు ఒక పేస్ ఆల్ రౌండర్ తో అడిలైడ్ టెస్ట్ బరిలోకి దిగనుంది
ఆస్ట్రేలియా తో జరిగే రెండో టెస్ట్ కు భారత్ తుదిచెట్టు (అంచనా):
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ ,విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ,నితీష్ రెడ్డి ,రవిచంద్రన్ అశ్విన్ ,మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రానా ,జస్ప్రిత్ బూమ్రా.
ప్రశ్నలు మరియు సమాదానాలు
1 ) ఇండియా , ఆస్ట్రేలియా రెండో టెస్ట్ ఎప్పుడు జరుగుతుంది ?
A )ఇండియా , ఆస్ట్రేలియా రెండో టెస్ట్ డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 10 వరకు జరుగుతుంది .
2 ) ఇండియా , ఆస్ట్రేలియా రెండో టెస్ట్ డే అండ్ నైట్ గా జరుగుతుందా ?
A ) ఇండియా , ఆస్ట్రేలియా రెండో టెస్ట్ డే అండ్ నైట్ గా జరుగుతుంది .
3 ) ఇండియా , ఆస్ట్రేలియా రెండో టెస్ట్ ఎక్కడ జరుగుతుంది ?
A ) ఇండియా , ఆస్ట్రేలియా రెండో టెస్ట్ ఆస్ట్రేలియా లో ఆడిలైట్ లో జరుగుతుంది .
4 ) ఆస్ట్రేలియా లో ఆడిలైట్ స్టేడియం కెపాసిటీ ఎంత ?
A ) ఆస్ట్రేలియా లో ఆడిలైట్ స్టేడియం కెపాసిటీ 53 ,583 .
5 ) ఆస్ట్రేలియా తో జరిగే రెండో టెస్ట్ కు భారత్ తుదిజట్టు ఎలా ఉంటుంది ?
A ) ఆస్ట్రేలియా తో జరిగే రెండో టెస్ట్ కు భారత్ తుదిజట్టు (అంచనా): .యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ ,విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ,నితీష్ రెడ్డి ,రవిచంద్రన్ అశ్విన్ ,మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రానా ,జస్ప్రిత్ బూమ్రా.