AP Free Gas Cylinders Schemes update Govt of AP
Free Gas Cylinders Schemes update:
Free Gas Cylinders Schemes update for AP Govt :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల దీపం పథకం కింద అమలు చేస్తున్నారు . ఈ పథకానికి దీపావళి పండగ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకానికి సంబంధించిన మార్గ దర్శకాలను అర్హులైన వారికి ఉచిత సిలిండర్లను అందజేస్తున్నారు . ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వనుండగా ప్రభుత్వంపై రూ.2,685 కోట్ల భారం పడనుంది. గ్యాస్ కనెక్షన్ ఉన్న అర్హులైన ప్రతి కుటుంబానికి వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తెలిపారు.
ఉచిత గ్యాస్ సీలిండర్లు పొందడానికి ఈ అర్హతలు తప్పనిసరి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం సూపర్ సిక్స్ లో భాగంగా ఒక గుడ్ న్యూస్ చెప్పింది సూపర్ సిక్స్ లో భాగంగా ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అందించే పథకాన్ని ప్రకటించింది దీని ద్వారా ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తారు ఈ పథకం ముఖ్య ఉద్దేశం గ్యాస్ వాడకం మరింత ప్రోత్సహించడానికి అంతేకాకుండా ప్రతి కుటుంబానికి ఆర్థిక భారం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దీని ద్వారా ప్రతి మహిళ గ్యాస్ వినియోగించడం వల్ల వారి శ్రమ భారం తగ్గుతుంది , సమయం ఆదా అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని దీపావళి పండుగ నుండి ప్రారంభించు చున్నారు
ఉచిత గ్యాస్ సిలిండర్ అర్హతలు
ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి ముఖ్యంగా పేద వర్గాలకు చెందిన మహిళలు అర్హులు
ఈ పథకంలో చేరడానికి కొన్ని నియమాలు మరియు అర్హతలు అమలులో ఉన్నాయి అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి.
నియమాలు :
1)బియ్యం కార్డు లేదా వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి ఈ కార్డు కలిగి ఉన్నవాళ్లు మాత్రమే ఈ సిలిండర్ పథకంలో అర్హత ఉంటుంది
2)కుటుంబంలో గృహిణి పేరుమీద గ్యాస్ కనెక్షన్ ఉండాలి
3)ప్రస్తుతం ఉన్న గ్యాస్ డీలర్ల ద్వారా ఈ పథకం నిర్వహణ జరుగుతుంది
వయస్సు :
1)ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం పొందాలంటే కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
2)గృహిణి లేదా గ్యాస్ కనెక్షన్ పేరు పై ఉన్న వ్యక్తి వయసు కనీసం 18 ఏళ్లు ఉండడం తప్పనిసరి
కావలసిన డాక్యుమెంట్ వివరాలు :
ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి మీరు అందించాల్సిన డాక్యుమెంట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి
1)బియ్యం కార్డు లేదా వైట్ రేషన్ కార్డు: ఇది ప్రభుత్వ సబ్సిడీ పథకాలను అర్హతలను నిర్ధారిస్తుంది
2)ఆధార్ కార్డ్ : వ్యక్తిగత వివరాలను ధ్రువీకరించడానికి అవసరం
3)బ్యాంకు ఖాతా నెంబర్ : డబ్బులు రాయితీ రూపంలో బ్యాంకు ఖాతాలోకి జమ అవ్వడానికి అవసరం
4)గ్యాస్ కనెక్షన్ బుక్ లేదా డాక్యుమెంట్ : ప్రస్తుతం ఉన్న గ్యాస్ కనెక్షన్ బుక్ ఉంటె సరిపోతుంది లేదా మీరు తీసుకున్న గ్యాస్ కనెక్షన్ డాక్యుమెంట్ ఉన్న సరిపోతుంది
ముఖ్యమైన తేదీ వివరాలు :
5)ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభం: ఈ నెల 31 అంటే అక్టోబర్ 31 నుంచి మొదటి సిలిండర్ బుకింగ్ ప్రాంభమవుతుంది .
6)సిలిండర్ సరఫరా : 2024 అక్టోబర్ 31 నుంచి 2025 మార్చ్ 31 లోపు మొదటి ఉచిత సిలిండర్ బుక్ చేసుకోవచ్చు .
తరుచు అడిగే ప్రశ్నలు మరియు సమాదానాలు:
1)ఈ పథకం కింద ఫ్రీ సిలిండర్ ఎలా బుక్ చేసుకోవాలి ?
సమాధానం : మీరు వాడుతున్న ప్రస్తుత గ్యాస్ ఏజెన్సీ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదా గ్యాస్ ఏజెన్సీ వెబ్సైటు ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదా మొబైల్ అప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు .
2)రాయితీ ఎంత ఇస్తుంది ?
సమాధానం : ప్రస్తుతం మీకు గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఎంత రాయితీ వస్తుందో అదే మొత్తం మీ బ్యాంకు ఖాతా లో జమ అవుతుంది ప్రస్తుతం రూ.851 వస్తుంది .
3)బుకింగ్ తర్వాత ఎంత సమయం లో రాయితీ డబ్బులు జమ అవుతాయి ?
సమాధానం : బుకింగ్ చేసిన తర్వాత ఫ్రీ గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన తర్వాత 48 గంటలలో మీ రాయితీ మీ బ్యాంకు ఖాతా లో జమ అవుతాయి .
4)ఏ ఏ పత్రాలు అవసరం అవుతాయి ?
సమాధానం : రేషన్ కార్డు ,ఆధార్ కార్డు ,గ్యాస్ ఏజెన్సీ డాక్యుమెంట్, బ్యాంకు ఖాతా నెంబర్ మరియు గ్యాస్ బుక్ .
5)ప్రతి సంవత్సరం ఎన్ని గ్యాస్ సీలిండర్లు ఉచితం గ లభిస్తాయి ?
సమాధానం : ప్రతి సంవత్సరం 3 సీలిండర్లు ఉచితం గ లభిస్తాయి .